విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో అనుష్క‌.. ఖుషీలో ఫ్యాన్స్‌?

October 5, 2020 at 3:43 pm

లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్రెస్ అయిన అనుష్క శెట్టి.. చాలా గ్యాప్ త‌ర్వాత న‌టించిన చిత్రం `నిశ్శబ్ధం`. ఈ చిత్రం ఓటీడీ వేదిక‌గా అమెజాన్‌ ప్రైమ్‌లో అక్టోబ‌ర్ 2న విడుద‌ల అయిన సంగ‌తి తెలిసిందే. కోన వెంకట్‌, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హేమంత్‌ మధుకర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే ఈ చిత్రం పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయినా.. అనుష్క న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రం త‌ర్వాత అనుష్క సినిమా గుడ్ బై చెప్ప‌నున్నారు అని వార్త‌లు వ‌స్తున్న త‌రుణంలో.. ఫ్యాన్స్‌ను గుడ్‌న్యూస్ చెప్పింది స్వీటీ. తాజాగా ట్విట్ట‌ర్ ఫాన్స్‌తో చాట్ చేసిన అనుష్క‌.. తాను మరో రెండు సినిమాలకు ఒప్పుకున్నట్లు ఆమె వెల్లడించారు. కానీ ఎవరితో వర్క్ చేస్తోంది అనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. అయితే తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటిసారి ఒక క్రేజీ కాంబినేషన్ వెండితెరపైకి రానున్నట్లు తెలుస్తోంది.

ఓ కొత్త దర్శకుడు పరిచయం అవుతున్న సినిమాలో.. అనుష్క విజయ్ దేవరకొండతో జ‌త క‌ట్ట‌నున్న‌ట్టు టాక్ న‌డుస్తోంది. దీనికి సంబంధించిన ప్రోజెక్ట్‌పై ఇద్దరు సంతకం చేశారని.. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. అయితే వయసులో అనుష్క కంటే విజయ్ ఏడేళ్లు చిన్నవాడు. అలాంటి హీరోతో అనుష్క ఎలాంటి పాత్ర చేయనుంది అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాగా, విజ‌య్ దేవ‌ర‌కొండు ప్ర‌స్తుతం పూరి ద‌ర్శ‌క‌త్వంలో ఫైట‌ర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో అనుష్క‌.. ఖుషీలో ఫ్యాన్స్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts