‘ఫైటర్’తో నా బాలీవుడ్ ఎంట్రీ జర‌గ‌దు.. విజయ్ కొత్త ట్విస్ట్‌!

October 22, 2020 at 8:59 am

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్ర‌స్తుతం న‌టిస్తున్న చిత్రం `ఫైట‌ర్‌`. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జగన్నాథ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. పూరీ జగన్నాథ్, ఛార్మి, కరణ్‌ జోహార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ విజయ్‌కు తల్లిగా నటిస్తున్నారు.

అలాగే విజ‌య్ తండ్రి పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి కనిపించబోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషాల‌తో పాటు ఇండియాలోని ప్రధాన భాషాల్లో కూడా విడుదలకానుంది. తెలుగుతో పాటు విజ‌య్‌ మొదటిసారి నేరుగా చేస్తున్న హిందీ చిత్రం కావడంతో ఇదే ఆయన బాలీవుడ్ ఎంట్రీ చిత్రమని అందరూ భావిస్తున్నారు.

కానీ, విజ‌య మాత్రం అలా అనుకోకుండా కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. ఇటీవ‌ల ఈ చిత్రంపై మాట్లాడుతూ..ఫైటర్ చిత్రాన్ని హిందీలో తనకు డెబ్యూ చిత్రమని భావిండం లేదని, అసలు బాలీవుడ్ అనేది ఇండియాలో సపరేట్ పరిశ్రమ అని తాను అనుకోవడమే లేదని, ఇండియాలోని సినీ పరిశ్రమలన్నీ ఒక్కటేనని చెప్పిన విజ‌య్.. ఫైటర్ అనేది తనకొక మంచి, థ్రిల్లింగ్ ప్రాజెక్ట్ అని తెలిపాడు. మొత్తానికి విజ‌య్ మాట‌లు క‌రెక్ట్‌గా, కన్విన్స్‌‌గా ఉన్నాయ‌ని చెప్పాలి.

‘ఫైటర్’తో నా బాలీవుడ్ ఎంట్రీ జర‌గ‌దు.. విజయ్ కొత్త ట్విస్ట్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts