విజ‌య్ దేవ‌ర‌కొండ సూప‌ర్ రికార్డ్‌.. రౌడీనా మాజాకా!

October 1, 2020 at 7:19 am

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఎంత క్రేజ్ ఉండో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా విజ‌య్ ఫాలోంగ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఇక ప్ర‌స్తుతం విజ‌య్.. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫైటర్‌’. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం తెలుగు హిందీ భాషాల్లో మాత్రమేకాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. ఇక ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాకుండానే.. మ‌రో సినిమాను లైన్‌లో పెట్టాడు విజ‌య్‌. సుకుమార్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టు విజయ్ దేవరకొండ స్వయంగా ప్ర‌క‌టించాడు. ఇదిలా ఉంటే.. తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ సూప‌ర్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విజ‌య్ త‌న ఇన్‌స్టాగ్రాములో 9 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌ని సంపాదించుకున్నాడు. దక్షిణాదిలో ఇన్‌స్టాలో 9 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన ఏకైక హీరోగా విజయ్ దేవరకొండ రికార్డ్ క్రియేట్ చేశారు. కాగా, రెండేళ్ల క్రితం 2018 మార్చి 7న విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ఇన్ స్టా గ్రామ్ ఖాతాని ప్రారంభించారు. త‌క్కువ వ్యవధిలోనే 9 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌ని సొంతం చేసుకోవ‌డం ఓ రికార్డుగా చెప్పుకోవ‌చ్చు.

విజ‌య్ దేవ‌ర‌కొండ సూప‌ర్ రికార్డ్‌.. రౌడీనా మాజాకా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts