అమ్మ నాన్న ఓ తమిళమ్మాయికి సీక్వెల్‌గా విజ‌య్ `ఫైట‌ర్‌`.. ?

October 20, 2020 at 8:26 am

పూరి జగన్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో రావితేజ హీరోగా తెర‌కెక్కిన 2003లో విడుద‌లైన `అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి` మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ `ఫైట‌ర్‌` వ‌స్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇస్మార్ట్‌ శంకర్‌ లాంటి సూప‌ర్ హిట్ తర్వాత పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఫైటర్.

పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. దీంతో చిత్రం గతంలో పూరి చేసిన ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’కి సీక్వెల్ అనే ప్రచారం మొదలైంది. ఆ చిత్రంలో హీరో తల్లి పాత్ర సినిమాకు ప్రధానం కాగా.. ఫైటర్ లో కూడ హీరో త‌ల్లి క్యారెక్టర్ కీలకంగా ఉండనుంది.

ఫైట‌ర్‌లో విజ‌య్ త‌ల్లి పాత్ర కోసం భారీ రెమ్యున‌రేష‌న్ ఇచ్చి రమ్యకృష్ణను తీసుకున్నారు. దీంతో ఇది సీక్వెల్ అనే వార్తలు మరింత బలపడ్డాయి. అయితే మ‌రోవైపు మాత్రం ఇది సీక్వెల్ కాదని, పూర్తిగా కొత్త కథని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఎందులో నిజం ఉందో త్వ‌ర‌లోనే తెలియ‌నుంది. కాగా, ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే టాలీవుడ్ కి పరిచయం అవుతోంది.

అమ్మ నాన్న ఓ తమిళమ్మాయికి సీక్వెల్‌గా విజ‌య్ `ఫైట‌ర్‌`.. ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts