ముత్తయ్య విజ్ఞప్తి.. `800` నుంచి విజయ్‌ సేతుపతి ఔట్‌..!

October 20, 2020 at 9:13 am

శ్రీలంక మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌ను ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. స్టార్ హీరో విజయ్ సేతుపతి ముత్తయ్య పాత్ర‌లో `800` పేరిట ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీపతి తెర‌కెక్కించాల‌ని భావించారు. అయితే బ‌యోపిక్ ప్ర‌క‌టించినప్ప‌టి నుంచి శ్రీలంక త‌మిళుల‌పై జ‌రిపిన మార‌ణ‌కాండ‌ను ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ ఎన్న‌డూ ఖండించ‌లేద‌ని త‌మిళులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే సినిమా నుంచి త‌ప్పుకోవాల‌ని త‌మిళులు విజ‌య్ సేతుప‌తిపై ఒత్తిడి చేస్తున్నారు. తమిళ సీనియర్ దర్శకుడు భారతీరాజా కూడా అతని బయోపిక్ లో విజయ్ నటించడం కరెక్ట్ కాదన్నాడు. తన బయోపిక్‌పై వస్తున్న ఈ కాంట్రవర్సీలు చూసిన మురళీధరన్.. తన బయోపిక్‌ నుంచి తప్పుకోవాలంటూ విజయ్‌ సేతుపతికి విజ్ఞప్తి చేసాడు.

ఈ మేరకు ఓ పెద్ద లేఖ విడుదల చేసాడు ముత్తయ్య. అందులో `నా కారణంగా ఓ అద్భుతమైన నటుడికి ఇబ్బందులు ఎదురవడం సహించలేను. భవిష్యత్‌లో సమస్యలు ఎదురుకాకూడదనే ఉద్దేశంతోనే బయోపిక్‌ నుంచి తప్పుకోవాలని కోరా’ అని మురళీ తెలిపాడు. దీంతో విజ‌య్ సేతుప‌తి ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నారు. మురళీధరన్ బయోపిక్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు చెప్పాడు విజయ్ సేతుపతి.

ముత్తయ్య విజ్ఞప్తి.. `800` నుంచి విజయ్‌ సేతుపతి ఔట్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts