హెరిటేజ్ సంస్థపై విజయసాయి కీలక వ్యాఖ్యలు…

October 29, 2020 at 12:02 pm

ఎప్పుడులాగానే గురువారం కూడా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ఫ్యామిలీ నడుపుతున్న హెరిటేజ్ సంస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కోటానుకోట్ల రూపాయల లాభాల్లో ఉన్న హెరిటేజ్‌ సంస్థ.. ఇప్పుడు ఎందుకు నష్టాల్లో ఉందని ప్రశ్నించారు.

అసలు కోఆపరేటివ్‌ బెయిరీలను సర్వనాశనం చేసి రైతులను భ్రష్టు పట్టించారని, చంద్రబాబు అధికారంలో ఉంటే కోటానుకోట్ల లాభాలు, అధికారం పొతే నష్టాలు ఏమిటో అని విజయసాయి ఎద్దేవా చేశారు. అసలు అవినీతి డబ్బును  వైట్ మనీగా మార్చుకోడానికే  హెరిటేజ్ పెట్టాడా? అని బాబుపై మండిపడ్డారు.

తన స్వార్థం కోసం పాడి రైతుల ఆధ్వర్యంలో నడిచే  కోఆపరేటివ్ డైయిరీలను సర్వనాశనం చేసి రైతులను భ్రష్టు పట్టించాడని విమర్శించారు. అంతకముందు పోలవరంలో కమీషన్ల కోసం అప్పట్లో కేంద్రం పెట్టిన షరతులను అంగీకరించాడని, పోలవరంను ఏటీఎంలా వాడుకున్నాడని సాక్షాత్తు ప్రధానే ఆవేదన వ్యక్తం చేశారని బాబుపై విజయసాయి విమర్శలు గుప్పించారు.

 

హెరిటేజ్ సంస్థపై విజయసాయి కీలక వ్యాఖ్యలు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts