బాబు ఆ లాజిక్ మిస్ అయ్యారు…

October 23, 2020 at 11:24 am

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై సెటైర్ వేసేశారు. ప్రతిరోజూ లాగానే ఈరోజు కూడా విజయసాయి, బాబుకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా చంద్రబాబు, జగన్‌పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అమరావతిని జగన్ గాలికొదిలేశారని, అసలు ఈ ఏడాదిన్నరలో జగన్ చేసింది ఏమీలేదని, గతంలో ఉన్న పథకాలకే పేరు మార్చి ఇప్పుడు అమలు చేస్తున్నారని అన్నారు.

ఇక బాబుకు, విజయసాయి కౌంటర్ ఇచ్చారు. ‘విమర్శలు నమ్మశక్యంగా, వాస్తవాలకు దగ్గరగా ఉండాలనే లాజిక్ ను చంద్రబాబు గారు ఎప్పుడో గాలికొదిలారు. సీఎంగా జగన్ గారు చేసింది శూన్యమంట. ఈయన పథకాలనే పేరుమార్చి అమలు చేస్తున్నాడట. గ్రాఫిక్స్ హోరు తప్ప తమరు పెట్టిన నాలుగు వెల్ఫేర్ స్కీముల పేర్లు చెప్పండి బాబూ?’ అని ఎద్దేవా చేశారు.

ఇక ‘ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏం చెబుతోంది? చంద్రబాబుది- తన కోసం, తన వారి కోసం ఆరాటం. జగన్ గారిది- వందల కులాలు, మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం నిరంతర పోరాటం’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

బాబు ఆ లాజిక్ మిస్ అయ్యారు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts