అమరావతికి ఐదేళ్లు…బాబుపై విజయసాయి సెటైర్లు..

October 22, 2020 at 4:14 pm

ఏపీ రాజధానిగా గత టీడీపీ ప్రభుత్వం అమరావతిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అమరావతికి ప్రధాని మోదీ వచ్చి శంఖుస్థాపన చేశారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం అంటే అక్టోబర్ 22న 2015లో అమరావతికి శంఖుస్థాపన చేశారు. ఇక అమరావతికి ఐదేళ్లు పూర్తి అయిన సందర్భంగా చంద్రబాబు ట్వీట్ చేశారు. విభజన నష్టాన్ని అధిగమించి 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన సంపద సృష్టి కేంద్రంగా, యువత ఉద్యోగావకాశాల కార్యస్థానంగా ప్రజారాజధాని అమరావతి శంకుస్థాపన జరిగి నేటికి 5 సంవత్సరాలు అయిందని వెల్లడించారు. మూడున్నర సంవత్సరాల పాటు నిరాటంకంగా సాగిన రాజధాని నిర్మాణ పనులను ఏడాదిన్నరగా ఆపేశారని విచారం వ్యక్తం చేశారు.

ఇక బాబుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. “బాబు అనుభవం అంతా రాష్ట్రాభివృద్ధిలో కాకుండా గ్రాఫిక్స్ లో చూపెట్టి… రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి, రాష్ట్ర ప్రయోజనాలన్ని తొక్కిపెట్టి, సొంత ప్రయోజనాలను ముందు పెట్టి… రాష్ట్రానికి తెచ్చింది ఏంటయ్యా అంటే నీరూ, మట్టి…. అందుకే జనాలు నిన్ను కూర్చోబెట్టారు ఓడగొట్టి” అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

 

అమరావతికి ఐదేళ్లు…బాబుపై విజయసాయి సెటైర్లు..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts