వైరల్ ఫోటో:: ఇది చేపనా..?? లేదా విమనమా..?

October 22, 2020 at 4:40 pm

మనం చాలా రకాల చేపలను మార్కెట్లో చూసి ఉంటాము.. అలాగే తిని ఉంటాము లెండి..చేపలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రుచి కూడా అమోఘం..అందుకనే ఎంత పెద్ద చేప ఉన్నాగాని, ధర ఎక్కువ అయినగాని కొనుక్కుని మరి ఇంటికి తీసుకుని వెళ్లి కూర వండుకుని లాగించేస్తాము. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. కారణం ఉంది.. అదేంటంటే మీరు ఎప్పుడన్నా పెద్ద చేపలను చూసారా..పెద్ద చేప అంటే 20 కేజీలు 100 కేజీలు చేప కాదండోయ్.. సుమారు 750 కేజీల బరువు ఉన్న చేప అని.. చూసి ఉండరు కదా.. కానీ ఇంత పెద్ద విమానం మాదిరిగా ఉన్న రెండు పేద్ద చేపలు కర్ణాటకలోని చేపలు పట్టే జాలరి వలకు చిక్కాయి.ఈ చేపలను మాంటా రేస్‌గా పిలుస్తారట. బుధవారం రోజున సుభాష్‌ సైలాన్‌ అనే జాలరి కర్ణాటక తీరం నుంచి చేపల వేటకు సముద్రంలోకి వెళ్లి వీటిని తన వలలో బంధించాడు.

పెద్ద చేప దాదాపు 750 కిలోల బరువు ఉండగా మరో చేప 250 కిలోల బరువు ఉన్నది.వలకు చిక్కిన ఈ చేపలను పడవలో నుంచి బయటకు తీసుకెళ్లేందుకు క్రేన్‌ కావాల్సి వచ్చింది. ఇక ఈ చాపల విషయానికి వస్తే మాంటా రేస్‌ చేపలు చాలా బరువుగా ఉంటాయి. ఒక్కొక్కటి వంద కిలోలకు పైగా బరువు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. మాంటా రేస్‌ చేపలు మొబులా జాతికి చెందినవి. త్రిభుజాకార పెక్టోరల్ రెక్కలు, కొమ్ము ఆకారంలో ఉన్న సెఫాలిక్ రెక్కలు, ముందుకు ఎదురుగా ఉన్న పెద్ద నోరును కలిగి వుంటాయి. మాంటా రేస్‌ చేపలు సాధారణంగా వెచ్చని సమశీతోష్ణ, ఉపఉష్ణమండల, ఉష్ణమండల జలాల్లో కనిపిస్తాయి

వైరల్ ఫోటో:: ఇది చేపనా..?? లేదా విమనమా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts