వైరల్ ఫోటో : ప్రభాస్ తో సెల్ఫీ దిగిన ఆ లేడీ ఎవరేంటే..??

October 27, 2020 at 5:35 pm

టాలీవుడ్ లో హీరో ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభాస్ కు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చిన గాని అభిమానులు తెగ సంబర పడిపోతారు. అయితే ఇప్పుడు ప్రభాస్ కు సంబందించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. వివరాలలోకి వెళితే… ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ జార్జియాలోని అంద‌మైన లొకేష‌న్ల‌లో కొన‌సాగుతుంది. ఈ లొకేషన్ లో ప్ర‌భాస్, పూజాహెగ్డేపై వచ్చే కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను షూట్ చేస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసిన రాధేశ్యామ్ మోష‌న్ పోస్ట‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి అద్బుత‌మైన స్పంద‌న వ‌స్తోంది.

అయితే ఇప్పుడు తాజాగా జార్జియా వీధుల్లో మన డార్లింగ్ ప్ర‌భాస్ కొరియోగ్రాఫ‌ర్ వైభ‌వి మ‌ర్చంట్ తో కలిసి కొన్ని సెల్పీ ఫోటోలు దిగాడు. ఈ ఫొటోల్లో వైభ‌వి ఒక కారు ముందు నిలబడి ప్ర‌భాస్ కు ఒక పూల బొకే అందించింది. ఆ త‌ర్వాత ప్ర‌భాస్ తో క‌లిసి కొన్ని సెల్ఫీలు తీసుకుంది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఇక వైభవి విషయానికి వస్తే తెలుగులో అత‌డు, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాల‌కు కొరియోగ్రఫీ చేసినది అలాగే హిందీలో కూడా ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాలు కూడా చేసింది.. !!

Darling #Prabhas with Vaibhavi Merchant from the sets of #RadheShyam pic.twitter.com/Y5OeVPbWPX
— BARaju (@baraju_SuperHit) October 27, 2020

వైరల్ ఫోటో : ప్రభాస్ తో సెల్ఫీ దిగిన ఆ లేడీ ఎవరేంటే..??
0 votes, 0.00 avg. rating (0% score)

Related Posts