వైరల్ వీడియో: చెట్టు ఎక్కి పాట పాడిన ఎలుగు బంటి..!

October 22, 2020 at 5:34 pm

ప్రపంచంలో ఎన్నో వింతలు.. మరెన్నో విశేషాలు.. ఒక్కోసారి ఆ వింతలు చూస్తుంటే భలే ఆశ్చర్యం వేస్తుంది కదా.. ఇప్పుడు అలాంటి వింత ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే మనం మనిషి పాట పాడటం విని ఉంటాము. అలాగే కోకిల పాట విన్నాము.. అయితే మీరు ఎప్పుడన్నా ఎలుగుబంటి పాట విన్నారా..? అది కూడా చెట్టు ఎక్కి పాడడం.. ఎలుగుబంటి ఏంటి.. చెట్టెక్కి పాట పాడడం ఏంటి అని షాక్ అవుతున్నారా..? అవును మీరు విన్నది నిజమే.. వివరాలలోకి వెళితే..

ఈ విచిత్రమైన సంఘటన యూఎస్‌ఏ లోని యోస్ ‌మైట్‌ పార్కులో జరిగింది. ఈ పార్క్‌లో సుమారు 300 నుంచి 500 వరకు ఎలుగుబంట్లు ఉన్నాయి. ఇందులో ఓ ఎలుగుబంటి గురువారం రోజున రై రై మంటూ చెట్టెక్కి పాట పాడడం మొదలెట్టింది. సుమారు ఒక నిమిషం పాటు పాటపాడింది. ఈ ఎలుగుబంటి వీడియోను ఎవరు తీసి పోస్ట్ చేసారో గాని తెగ వైరల్ అయింది. ఈ వీడియోను మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ లో ఇప్పటివరకూ వేలాదిమంది వీక్షించారు. మరి మీరు కూడా చూసి ఆనందించండి.

వైరల్ వీడియో: చెట్టు ఎక్కి పాట పాడిన ఎలుగు బంటి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts