వైరల్ వీడియో: డాన్స్ వేస్తూ కరోనా పేషెంట్స్ ను ఉత్సహ పరుస్తున్న డాక్టర్..!

October 19, 2020 at 7:51 pm

కరోనా వైరస్ దేశం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. ఇప్పటికే కరోనా వ్యాప్తి చెందుతూనే ఉంది. అయితే, ఈ మహమ్మారిని అరికట్టడానికి వైద్యులు ఎంతగానో కృషి చేస్తున్నారు. మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన నాటినుంచి వైద్యులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తూనే ఉన్నారు. కరోనా సోకిన రోగుల్లో ధైర్యం నింపుతూ, ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు. కరోనా వచ్చిన రోగుల్ని క్వారంటైన్‌లో ఉంచుతున్న విషయం తెలిసిందే. అయితే క్వారంటైన్‌లో ఉన్న రోగులను ఉత్సాహపరిచేందుకు కొందరు డాక్టర్లు డ్యాన్సులు కూడా చేశారు. ఇలాంటి కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ డాక్టర్‌ పీపీఈ కిట్‌, ఫేస్‌షీల్డ్‌ మాస్కు ధరించి చేసిన డ్యాన్స్‌ అందరిని ఆకట్టుకుంది. అతడు వార్‌ చిత్రంలోని ‘గున్గురూ..’ పాటకు అదిరిపోయే స్టెప్పులేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. కరోనా రోగుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ఈ డాక్టర్ చేసిన డాన్స్ అందరిని ఎంతగానో ఆకర్షించింది.. కరోనా వచ్చిందని మానసికంగా భాద పడే రోగుల్లో డాక్టర్ చేసిన డాన్సు మంచి ఉత్తేజాన్ని ఇచ్చింది.

వైరల్ వీడియో: డాన్స్ వేస్తూ కరోనా పేషెంట్స్ ను ఉత్సహ పరుస్తున్న డాక్టర్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts