వైరల్ వీడియో : రిక్షాను నడిపిన రోబో..!

October 21, 2020 at 5:59 pm

కొన్ని కొన్ని వీడియోలు చూస్తుంటే భలే ఆశ్చర్యం వేస్తుంది కదా.. !! ఆ వీడియో కనక నచ్చితే ఇంటర్నెట్‌లో ట్రెండింగ్ అవుతుంటాయి. అలాంటి ఒక వీడియో ఇప్పుడు నెటిజన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తూ, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలిస్తే మీరు కూడా నోరు వెళ్లబెడతారు…మాములుగా మనం ఎక్కడికన్నా వెళ్లాలంటే బైక్ ఉంటే బైక్ మీదనో లేక కార్ లోనే వెళతాం.. అదే ఏమి లేదంటే ఏ రిక్షానో, ఆటోనో ఎక్కి వెళతాం.. ఎక్కడ డ్రాప్ చేయాలో అన్న విషయాన్ని డ్రైవింగ్ చేసే మనిషికి చెప్తాము కదా..అయితే ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. !! ఈ వీడియో చూస్తే నిజంగా వింతే అంటారు.. ఈ వీడియోలో రిక్షాను మనిషి తోలడు. ఒక రోబో లాక్కెళ్తూ ఉండటాన్ని మనము చూస్తాము.

ఓక వ్యక్తి వచ్చి రిక్షాలో కూర్చుంటాడు . రిక్షాను లాగడానికి రెడీగా ఉన్న రోబో డాగ్‌ను తనను మార్కెట్‌కు తీసుకెళ్లాల్సిందిగా సదరు వ్యక్తి ఆదేసిస్తాడు. దీంతో ఆ రోబో రిక్షాను తోలుకుంటూ వెళ్తుంది అన్నమాట. ఈ వీడియోను బట్టి మనకు అర్ధం అయినది ఏంటంటే.. భవిష్యత్‌లో రిక్షాలు ఇలాగే ఉండబోతున్నేయేమో అనేలా ఈ వీడియో ఉంది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే ఇలాంటి రోబోల వల్ల చాలా మంది రిక్షా కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే అవకాశం లేకపోలేదు.. !!

వైరల్ వీడియో : రిక్షాను నడిపిన రోబో..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts