స్టేడియంలో కోహ్లీ చిత్ర‌విచిత్ర విన్యాసాలు.. నెట్టింట్లో వీడియో వైర‌ల్‌!

October 17, 2020 at 8:47 am

ఐపీఎల్ 2020 సీజన్ 13లో విరాట్ కోహ్లీ నేతృత్వంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి జోరు మీద ముందుకు సాగుతోంది. వ‌రుస విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకుంటూ.. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్‌-3 లో కొన‌సాగుతుంది కోహ్లీ సేన‌.

ఈ సీజ‌న్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడ‌గా.. అందులో ఐదు మ్యాచ్‌లు గెలిచి సత్తా చాటింది. ఇదిలా ఉంటే.. కోహ్లీ ఎంత ఫ‌న్నీగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆట‌లోనే కాదు.. ఇతరులను అనుకరించడంలోనూ, చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేసి న‌వ్వించ‌డంలోనూ కోహ్లీ రూటే స‌ప‌రేటు.

అయితే తాజాగా కూడా స్టేడియంలో కసరత్తులు చేస్తూ, వాటికి డ్యాన్స్ స్టెప్పులు మిక్స్ చేస్తూ కోహ్లీ చేసి కామెడీ అంతా ఇంతా కాదు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో వీడియోలో కోహ్లీ విన్యాసాలు చూసి నెటిజ‌న్లు తెగ న‌వ్వుకుంటున్నారు. మ‌రి ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.

 

స్టేడియంలో కోహ్లీ చిత్ర‌విచిత్ర విన్యాసాలు.. నెట్టింట్లో వీడియో వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts