
టాలీవుడ్ యాక్టర్ బ్రహ్మాజీ వరద నీటిలో ఉన్న తన ఇల్లు ఫొటోలను సోమవారం నాడు తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బ్రహ్మాజీ తాను ఒక బోటు కొనాలనుకుంటున్నానని సరదాగా కామెంట్ కూడా పెట్టారు.బ్రహ్మాజీ వ్యాఖ్యలపై కొంతమంది నెటిజన్లు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బ్రహ్మాజీ ఏకంగా తన ట్విటర్ అకౌంట్ ను పూర్తిగా డిలీట్ చేశాడు. ట్విటర్ ఖాతాను తొలగించడానికి గల కారణాన్ని వివరించాడు.
నేను, నా కుమారుడు ఆ సమయంలో బయటి నుంచి ఇంటికి తిరిగి వచ్చాం.వరద ఉధృతి కూడా ఎక్కువగా ఉండటంతో చాలా నీరు ఇంటిని చుట్టుముట్టింది. నా ఇంటి దగ్గరకు కారు వెళ్లే పరిస్థితి కూడా లేదు. దీంతో సమీపంలోని కాలనీ దగ్గర్లోనే కారు పార్కు చేశాను. అయితే వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొంతమంది స్థానికులు వచ్చి ఇంటికి క్షేమంగా వెళ్లేలా సాయం చేశారు. బేస్ మెంట్ లో కూడా వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. అప్పుడే నేను బోటును కొనాలనుకుంటున్నానని సరదాగా ట్విటర్ లో చిన్న జోకు వేశానని బ్రహ్మాజీ చెప్పుకొచ్చారు.