ఆదిపురుష్ లో ప్రభాస్ సరసన ఆమె ఫైనల్ అయినట్లేనా..?!

October 18, 2020 at 7:32 pm

ప్రభాస్ సినిమా అంటే చాలు అభిమానుల్లో పండగ వాతావరణ మొదలవుతుంది. ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తారు. అయితే ఇప్పుడు అభిమానులు ప్రభాస్ పుట్టినరోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎందుకు అనుకుంటున్నారా..? ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకి సంబంధించి ఒక్కో విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తున్నారు. ఒక వైపు అధికారికంగా ప్రకటనలు వస్తున్నప్పటికీ ఈ సినిమాపై రుమర్లు మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటించే హీరోయిన్ ఎవరనే అంశంపై తాజాగా మరో ప్రచారం ఊపందుకుంది.

ఆదిపురుష్ లో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించనుందట. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అంటే దీనిని బట్టి చుస్తే కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుందన్నమాట. ఇందులో వాస్తవం ఎంత ఉందొ అన్నా విషయం తెలియదు. ఇంతకుముందు ఇదే పాత్రకు కియరా అద్వానీ, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి. తాజాగా ఇప్పుడు కృతి సనన్ పేరు వైరల్ అయింది. మరి కృతి సనన్ ఈ సినిమాలో నిజంగానే హీరోయిన్ గా నటించనుందా లేదా అనే విషయంపై క్లారిటీ రావాలంటే ప్రభాస్ పుట్టినరోజు దాక ఆగాల్సిందే.

ఆదిపురుష్ లో ప్రభాస్ సరసన ఆమె ఫైనల్ అయినట్లేనా..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts