ఆ మెగా హీరో సినిమాలో రానా నటించనున్నాడా..??

October 20, 2020 at 5:40 pm

దగ్గుబాటి రాణా ప్రస్తుతం విరాటపర్వం సినిమాలో నటిస్తున్నాడు. బాహుబలి సినిమాలో బల్లాల దేవ ప్రతినాయకుడి పాత్రలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు రానా. ఆ సినిమా తర్వాత ఇప్పుడు ఒక సరి కొత్త కథతో, కథనంతో మన ముందుకు రాబోతున్నాదు. ఈ విరాట పర్వం సినిమాలో ప్రియమణి, సాయి పల్లవి కూడా నటిస్తుండడం విశేషం. ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహించనున్నారు. అయితే ఇప్పుడు రానా గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.. మెగా హీరో సినిమాలో రానా ఒక ప్రత్యేక పాత్ర చేస్తున్నాడంటూ వార్తలు దుమారం లేపాయి.. అసలు ఆ మెగా హీరో ఎవరో తెలుసా… చిరంజీవి మేనఅల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్.

క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ ఒక సినిమాలో నటించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర కోసం రానా అయితే బాగుంటుందని భావించి క్రిష్ రానా ని సంప్రదించినట్లు, రానా కూడా నటించడానికి ఒప్పుకున్నట్లు వార్తలువచ్చాయి. డైరెక్టర్ క్రిష్ కు రానాకి మధ్య ఒక మంచి రిలేషన్ ఉంది. వీరిద్దరూ కలిసి ఒక సినిమా కూడా చేసారు. అప్పటినుండి వీరి మధ్య అనుభందం ఏర్పడింది. అందుకే క్రిష్ అడగగానే రానా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.. ఇదే కనక నిజం అయితే ఈ సినిమాకి మంచి క్రెజ్ వచ్చే అవకాశం ఉంది.. !!

ఆ మెగా హీరో సినిమాలో రానా నటించనున్నాడా..??
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts