మహిళల రక్షణకు యోగి సర్కార్ కీలక నిర్ణయం..!

October 17, 2020 at 6:40 pm

ఇటీవలే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్రాస్ లో దళిత యువతిపై సామూహిక అత్యాచారం హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరిన్ని మహిళలపై అత్యాచారాలు దాడుల ఘటనలో కూడా వెలుగులోకి వస్తున్న ఈ క్రమంలోనే యోగి సర్కార్ ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే ఇలాంటి పరిణామాల నేపథ్యంలో యోగి సర్కార్ మహిళల రక్షణ కోసం నడుం బిగించింది. సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.

మిషన్ శక్తి అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు దాడులను నియంత్రిస్తాము అంటూ చెప్పుకొచ్చారు. ప్రతి మహిళ రక్షణ గౌరవం కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ఏకంగా 1535 పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి… మహిళ ఫిర్యాదులను లేడీ కానిస్టేబుళ్లు తీసుకుంటారు అంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది..

మహిళల రక్షణకు యోగి సర్కార్ కీలక నిర్ణయం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts