క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటించ‌డంలో వారికి సాటిలేరెవ‌రు!

October 7, 2020 at 8:59 am

ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్.. ఎప్పుడు అంతం అవుతుంది అన్న ప్ర‌శ్నకు.. ఎన్ని నెల‌లు గ‌డుస్తున్నా జ‌వాబు మాత్రం దొర‌క‌డం లేదు. కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన ఈ క‌రోనా వైర‌స్‌.. ప్రజ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా.. ఏదో ఒక‌వైపు నుంచి ఈ మ‌హ‌మ్మారి ఎటాక్ చేస్తుంది. ఇక ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా 3కోట్ల 60లక్షలు దాటింది.

అలాగే క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య ప‌దిన్న‌ర ల‌క్ష‌లు మించిపోయింది. అయితే క‌రోనా నుంచి ర‌క్షించుకోవాలంటే.. మాస్కులు ధ‌రించ‌డం, త‌ర‌చూ శానిటైజ‌ర్లు వాడ‌డం, భౌతిక‌దూరం పాటించ‌డం వంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం త‌ప్ప‌ని స‌రి అయింది. అయితే క‌రోనా జాగ్రత్తలు పాటించడంలో మహిళలు ముందంజలో ఉన్నట్లు తేలింది. క‌రోనా నిబంధనలు పాటించడంలో పురుషుల కంటే మహిళలు ఆదర్శంగా ఉంటున్నారని న్యూయార్క్‌, యేల్ యూనివర్సిటీ పరిశోధనలో స్పష్టమైంది.

వైద్య నిపుణులు సూచనలు మహిళలు తూచ తప్పకుండా పాటిస్తున్నారని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, పరిశుభ్రంగా ఉండటంలో ముందు వరుసలో ఉన్నట్లు పేర్కొంది. క‌రోనాను అరిక‌ట్ట‌డంతో మ‌హిళ‌లు త‌మవంతు కృషి చేస్తున్నార‌ని.. కానీ, పురుషులు మాత్రం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అందుకే ప్రపంచంలో ఎక్కువగా కరోనా భారిన పడిన వారిలో పురుషులు ఉన్నారని స్పష్టం చేసింది.

క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటించ‌డంలో వారికి సాటిలేరెవ‌రు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts