వైర‌ల్ వీడియో: రూ. 2.4 కోట్ల కారును త‌గ‌లెట్టేశాడు.. ఎందుకో తెలిస్తే షాకే!

October 28, 2020 at 4:13 pm

సాధార‌ణంగా ఎంతో ఇష్ట‌ప‌డి, ముచ్చ‌ట‌ప‌డి కొనుక్కున్న కారు.. ట్ర‌బుల్ వ‌స్తే ఏం చేస్తారు? ఎవ్వ‌రైనా మెకానిక్‌ దగ్గరికి తీసుకెళ్లి బాగుచేయించాకుంటారు. అయితే ఓ ర‌ష్య‌న్ వ్యాక్తి మాత్రం ఏకంగా పెట్రోల్‌ పోసి కారును త‌గ‌లెట్టేశారు. ఆ కారు ఖ‌రీదు అక్ష‌రాలా రూ. 2.4 కోట్లు. ఇంత‌కీ అంత ఖ‌రీదైన కారును ఎందుకు త‌గ‌ల‌బెట్టాడు? అన్న ప్ర‌శ్న ఇప్ప‌టికే మీ మ‌ద‌లో మొద‌ల‌య్యే ఉంటుంది. మ‌రి లేట్ చేయ‌కుండా ఆ వివ‌రాలు చూసేయండి..

మైఖేల్ లిట్ విన్ అనే ర‌ష్య‌న్ యూట్యూబ‌ర్‌.. ఎంతో ముచ్చ‌ట‌ప‌డి 2.4 కోట్ల రూపాయలు ఖ‌రీదు చేసే మెర్సిడెస్ ఏఎంజీ జీటీ 63 లగ్జరీ కారును కొనుగోలు చేశారు. కొనడమైతే కొన్నాడు గానీ.. కానీ, ఆ త‌ర్వాత‌ మాటిమాటికీ అది రిపేర్లకు వెళ్లడంతో అతడిలో సహనం నశించింది. కారు తరుచూ బ్రేక్‌డౌన్‌ అవుతూ ఇబ్బంది పెడుతోంది. ఆ సమస్య వచ్చినప్పుడల్లా కారును తనకు విక్రయించిన డీలర్ వద్దకు తీసుకెళ్తున్నాడు.

కానీచ దానిని ఎన్నిసార్లు రిపేర్‌కు ఇచ్చినా.. సరిగా పనిచేయడం లేదు. ఇక ఏ డీలర్ వద్ద కారు కొన్నాడో గానీ అతగాడు కూడా ఈ వాహనాన్ని బాగుచేయ‌లేక‌ చేయలేక చేతులెత్తేశాడు. ఇక చివ‌ర‌కు మైఖేల్ చేసేదేమి లేక కారు నిర్మానుష్యమైన పొలం వద్దకు తీసుకువెళ్లి దానికి అగ్గి రాజేశాడు. అది మంటల్లో మండుతుంటే తాపీగా బ్రెడ్డు ముక్క నములుతూ ఎంజాయ్ చేశాడు. ఇక ఆ దృశ్యాలన్నింటినీ లిట్విన్ విడియో తీసి తన యూట్యూబ్‌ చాలెన్‌లో అప్‌లోడ్ చేయ‌గా.. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్‌గా మారింది.

వైర‌ల్ వీడియో: రూ. 2.4 కోట్ల కారును త‌గ‌లెట్టేశాడు.. ఎందుకో తెలిస్తే షాకే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts