ఇంజినీరింగ్ విద్యార్ధులకు జగన్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్?

October 9, 2020 at 7:27 am

నేటి కాలంలో ఇంజినీరింగ్ చ‌దివి ఉద్యోగాలు లేక ఇబ్బందులు ప‌డుతున్న‌వారు భారీ సంఖ్య‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని క‌ష్ట‌ప‌డి ఎంతో ఖ‌ర్చు పెట్టి ఇంజినీరింగ్ చ‌దివి.. చివ‌ర‌కు ఉద్యోగాలు రాక ఎంద‌రో యువ‌త ఆత్మ‌హ‌త్య‌లు సైతం చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఏపీలోని ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న, పూర్తి చేసిన విద్యార్ధులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది జ‌గ‌న్ ప్ర‌భుత్వం.

ఆయా విద్యార్ధులకు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ముందుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఏపీఎస్‌ఎస్‌డీసీ.. ప్రముఖ శిక్షణా సంస్థ ఎక్స్ఎల్ఆర్‌తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.

దీని ప్రకారం డేటా అనాలసిస్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, బిగ్ డేటా లాంటి ఎమర్జింగ్ కోర్సుల్లో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధులు, ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్ధుల‌తో పాటు ప్రొఫెసర్లకు కూడా శిక్షణ ఇచ్చి.. ఉద్యోగ అవకాశాలు కల్పించ‌నున్నారు. దీనిపై పూర్తి వివ‌రాల‌ను ఏపీ స‌ర్కార్ త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నుంది.

ఇంజినీరింగ్ విద్యార్ధులకు జగన్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts