వాకింగ్‌కు వెళ్లిన వైసీపీ నేత‌పై దుండ‌గుల దాడి.. చివ‌ర‌కు?

October 10, 2020 at 8:12 am

కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ నాయకుడు, న్యాయవాది వుడూరు సుబ్బరాయుడు (50) శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్ల‌గా.. గుర్తు తెలియ‌న దుండ‌గులు క‌ర్రెల‌తో దాడి చేశారు. కర్రలతో తీవ్రంగా కొట్ట‌డంతో వుడూరు సుబ్బరాయుడు అక్క‌డే మృతి చెందారు.

దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. నంద్యాలలోని విజయ పాల డెయిరీ సమీపంలో ఈ దారుణం జరిగింది. చివ‌ర‌కు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ క్ర‌మంలోనే మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు.

ప్ర‌స్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే వైఎస్సార్‌సీపీ వార్డు ఇన్‌చార్జిగా ఉన్న ఆయనపై 2017 ఆగస్టు 14న నంద్యాల ఉప ఎన్నిక సమయంలోనూ హత్యాయత్నం జరిగింది. రోజూ వాకింగ్‌కు వెళ్లే సమాచారం తెలుసుకున్న ప్రత్యర్థులు పథకం ప్రకారం మాటువేసి ఆయన్ని హత్యచేశారని అంటున్నారు.

వాకింగ్‌కు వెళ్లిన వైసీపీ నేత‌పై దుండ‌గుల దాడి.. చివ‌ర‌కు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts