ఏపీ ప్రభుత్వానికి అంబులెన్స్‌లు ఇచ్చిన జీ టీవీ..  

October 13, 2020 at 5:49 pm

ఇటీవల జీ తెలుగులో ప్రసారమైన ఓ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్‌ని ఇమిటేట్ చేసి, అవమానించారని వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు ఆ చానల్‌పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఆ ప్రోగ్రాం నిర్వాహకులు, జడ్జీలు, కంటెస్టంట్స్‌పై తీవ్రంగా ఫైర్ అయ్యారు. దీంతో వారు జగన్ అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు.

ఈ క్రమంలోనే జీ టీవీ యజమాన్యం ఏపీ ప్రభుత్వానికి 10 అంబులెన్స్‌లను అందజేసింది. ఈ అంబులెన్స్‌లను మంత్రి పేర్ని నాని, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ రోజా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రోజా స్వయంగా అంబులెన్స్‌ను నడిపారు. దేశంలో ఎవరూ చేయని విధంగా జగన్ పేదలకు వైద్యం అందిస్తున్నారని, కరోనా నియంత్రణలో సీఎం జగన్‌ దేశానికే ఆదర్శంగా నిలిచారని రోజా కొనియాడారు. పేర్ని నాని మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ప్రయత్నానికి సహాయపడుతూ అంబులెన్స్‌లు అందించడం సంతోషకరం అన్నారు.

MLA RK Roja Drives New Ambulance In Vijayawada - Sakshi

ఏపీ ప్రభుత్వానికి అంబులెన్స్‌లు ఇచ్చిన జీ టీవీ..  
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts