గోపీచంద్ కూత మొదలయింది..!!

November 24, 2020 at 4:49 pm

హీరో గోపిచంద్ , దర్శకుడు సంపత్‌ నంది కంబినేషన్లో తెరెకెక్కుతున్న చిత్రం సీటీమార్‌. ఈ చిత్రంలో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. ఈ చిత్రంలో ఆంధ్రప్రదేశ్‌ కబడ్డీ జట్టు కోచ్‌ పాత్రలో గోపిచంద్‌, తెలంగాణ కోచ్‌గా తమన్నా నటిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ నిబంధనల ఎత్తివేతతో సినిమా షూటింగ్‌ సోమవారం రోజున పునఃప్రారంభమైంది. ఇదివరకే గోపిచంద్‌, సంపత్‌ దర్శకత్వంలో గౌతమ్‌ నంద చిత్రం వచ్చింది. దీనిలో గోపిచంద్ మాస్‌ యాక్షన్‌, క్లాస్‌ పాత్రల్లో నటించి డబుల్‌ యాక్షన్‌తో ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా సంపత్‌ నంది దర్శకత్వం వహించిన బెంగాల్‌ టైగర్‌ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుని ఘానా విజయం సాధించారు.

ఈ చిత్రంలో గోపిచంద్‌ సరసన మరో హీరోయిన్ గా దిగంగన నటిస్తోంది. ఏమైంది ఈవేళ చిత్రంతో సంపత్‌ నంది టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచియమయ్యాడు. ప్రస్తుతం సీటీమార్‌ సినిమాతో తన ఖాతాలో మరో సూపర్‌ హిట్‌ కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాడు సంపత్.

గోపీచంద్ కూత మొదలయింది..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts