నాగ శౌర్య సరసన ఆ టాప్ సింగర్..!?

November 21, 2020 at 3:20 pm

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య సొంతంగా ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై కొత్త సినిమాను మొదలు పెట్టిన సంగ‌తి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి డైరెక్టర్ అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఒక‌ న్యూస్ ప్రస్తుతం ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ప్ర‌ముఖ సింగింగ్‌ సెన్సేష‌న్ అయిన శిర్లే సెటియా తెలుగు ప్రేక్ష‌కుల‌ను అలరించేందుకు సిద్ధం అవుతుంది. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన న‌టిస్తున్న‌ట్టు చిత్ర‌ యూనిట్ తెలిపింది.

శిర్లే సెటియా ప్ర‌ముఖ ఫోర్బ్స్ మ్యాగ‌జైన్ లో తళుక్కుమంది. ఈ సంవత్సరం నిక‌మ్మ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని నాగశౌర్య త‌ల్లిదండ్రులు ఉషా, శంక‌ర్ ములుపూరి కలిసి నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించనున్నాడు.

నాగ శౌర్య సరసన ఆ టాప్ సింగర్..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts