మరో సారి రియల్ హీరో అనిపించుకున్న మహేష్ బాబు…!?

November 30, 2020 at 3:24 pm

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సినిమాలోనే కాకుండా లైఫ్ లో కూడా రియల్ ‌ హీరో అని మరోసారి నిరూపించుకున్నాడు. గత కొన్నాళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్న ప్రిన్స్ మహేష్‌ అరుదైన వ్యాధి సోకిన చిన్నారులకు వైద్యం కోసం ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి వారి పాలిట రియల్ హీరో అయ్యాడు. తాజాగా ఏపీకి చెందిన డింపుల్‌ అనే చిన్నారి వైద్య ఖర్చులు అన్ని మహేశ్‌ బాబు అందించారు.

ఆ చిన్నారికి అరుదైన కాల్సిఫైడ్‌ పల్మనరీ వాల్వ్‌ అనే వ్యాధి రావటంతో, దానికి వెంటనే ట్రీట్‌ మెంట్‌ కూడా ప్రారంభించారు. దానికి అయ్యే ఖర్చులన్నీ మహేష్‌ బాబు నే భరించారు. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకోగా, ఆ చిన్నారికి ఆ భగవంతుని మరియు తన దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్రత ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు. మహేష్‌ ప్రస్తుతం సర్కారు వారి పాట అనే మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో మహానటి ఫేమ్ కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

మరో సారి రియల్ హీరో అనిపించుకున్న మహేష్ బాబు…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts