మోహన్ బాబు సన్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్ లో!!

November 26, 2020 at 7:16 pm

విలక్షణ నటుడు మంచు మోహన్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న దేశభక్తి కథా చిత్రం సన్‌ ఆఫ్‌ ఇండియా. ఈ సినిమాకి రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్‌ పథకం పై మంచు విష్ణు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ని తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ చిత్రంలో ఇదివరకెన్నడూ చూడని పవర్‌ఫుల్‌ పాత్రలో మంచు మోహన్‌బాబు కనిపించనున్నారు. ఈ తరహా కథ ఇప్పటివరకూ తెలుగులో రాలేకపోటం ఈ సినిమాకి మరో విశేషం.

ఇటీవల తిరుపతి లో కొన్ని ముఖ్యమైన సీన్స్ తో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించారు. ఈ చిత్రానికి మోహన్‌బాబు స్వయంగా స్క్రీన్‌ప్లే సమకూర్చారు. ఈ చిత్రానికి దర్శకుడు ‘డైమండ్‌’ రత్నబాబు, తోటపల్లి సాయినాథ్‌ మాటలు సమకూర్చారు. ఈ సినిమాలో మోహన్‌బాబుకు స్టయిలిస్ట్‌గా ఆయన పెద్ద కోడలు, మంచు విష్ణు భార్య విరానికా మంచు వ్యవహరిస్తుండటం ఇంకో విశేషం. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి పవర్ఫుల్ రోల్ లో విలక్షణ నటుడు మోహన్ బాబు ఎలా ఉంటారో తెర పై చూడాల్సిందే.

మోహన్ బాబు సన్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్ లో!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts