20 ఏళ్ల ప్రయత్నం..నిజం చేసుకున్న మహిళామణులు!!

November 26, 2020 at 5:19 pm

ప్రారంభమై 20 ఏళ్ల అయినా కేబీసీ షో ఇప్పటికి సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా విపరీతమైన క్రే జ్‌ ఉంది ఈ షోకి. ఇకపోతే కేబీసీ సీజన్‌ 12 నెల రోజుల క్రితమే ప్రారంభమయ్యింది. అయితే ఈ సీజన్‌కు ఒక విశేషం ఉంది. ఈ సీజన్‌ ప్రారంభమైన నెలరోజుల కాల వ్యవధిలో ముగ్గురు మహిళలు కోటీశ్వరులుగా గెలిచారు. ఈ సీజనల్‌లో ఇప్పటి వరకు కోటీశ్వరులుగా నిలిచిన ఆ ముగ్గురు మహిళలు నాజియా నజీమ్‌, మోహితా శర్మ, అనుప దాస్‌. ఇక ఈ ముగ్గురు కోటీశ్వరుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

కేజీబీ సీజన్‌ 12లో మొదటి కోటీశ్వరురాలుగా నాజియా నసీమ్ నిల్చున్నారు‌. ఢిల్లీకి చెందిన నాజియా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీలో కమ్యూనికేషన్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఆట తీరు పై బిగ్‌ బీ కొనియాడుతూ ఎంతో మెచ్చుకున్నారు.కేబీసీ సీజన్‌లో 12లో రెండవ కోటీశ్వరురాలిగా హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారిణి మోహితా శర్మ నిలిచారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో ఏఎస్‌పీగా విధులు నిర్వహిస్తూ మోహితా కేబీసీ 12లో రెండో కోటీశ్వరురాలిగా నిల్చున్నారు. ఈ సీజన్‌లో కోటీ రూపాయలు గెలుచుకున్న మూడవ మహిళగా చత్తీస్‌గఢ్‌కు చెందిన స్కూల్‌ టీచర్‌ అనుపదాస్‌ నిలిచారు. మరో విశేషం ఏంటంటే వీరంతా కేబీసీ ప్రారంభమై నాటి నుండి నేటి వరుకు, అంటే 20 ఏళ్లుగా దీనిలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. 20 ఏళ్ల తర్వాత ఇలా అవకాశం రావడం కోటీశ్వరులుగా మారడం కూడా విశేషమే.

20 ఏళ్ల ప్రయత్నం..నిజం చేసుకున్న మహిళామణులు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts