వచ్చే దసరాకి ఆ నలుగురి సినిమాలు పోటీ…!?

November 28, 2020 at 3:51 pm

ఈ సంవత్సరం 2020 కరోనా దెబ్బకు బలైపోయింది. ఈ ఏడాది ఒక పండగ కూడా లేదు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ అంటూ వార్తలు వస్తున్న సమయంలో పెద్ద సినిమాలు రిలీజ్ చేసేంత ధైర్యం చెయ్యట్లేదు దర్శక నిర్మాతలు . దాంతో హీరోలు, దర్శక నిర్మాతల అందరి కన్ను వచ్చే ఏడాదిపైనే పడింది. ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా 2021 సమ్మర్ వరకు కూడా కరోనా ప్రభావం పూర్తిగా పోయేలా కనిపించడం లేదు. దాంతో సంక్రాంతి పండుగ పై కూడాపెద్దగా ఆసలు పెట్టుకోవట్లేదు,. ఈ క్రమంలో అందరి హీరోల కన్ను 2021 దసరాపై పడింది.ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా వచ్చే ఏడాది దసరాకి విడుదల చెయ్యటానికి సన్నాహాలు చేస్తున్నారు.

అయితే మరో మూడు భారీ చిత్రాలు కూడా దసరా పండక్కి రిలీజ్ చెయ్యాలని చూస్తున్నాయి. అందులో రెబెల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ ఉంది. ఇంకా ప్రిన్స్ మహేష్ బాబు సర్కారు వారి పాట స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ఉన్నాయి. ఈ నాలుగు చిత్రాల షూటింగ్స్ అనుకున్న సమయానికి పూర్తి చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే చిరంజీవి ఆచార్య మూవీ షూటింగ్ సగం దాక పూర్తయింది. మిగిలిన సగం కూడా వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ కూడా అడవుల్లో చాలా వేగంగా కొనసాగుతుంది. ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ చివరి దశకు చేరుకుంది. చూడాలి వచ్చే దసరాకి ఎవరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత వసూళ్లు చేస్తాయ్యో.

వచ్చే దసరాకి ఆ నలుగురి సినిమాలు పోటీ…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts