ఆ పథకం డబ్బులు రాలేదా.. ఇలా చేస్తే సరి..?

November 25, 2020 at 2:31 pm

కరోనా వైరస్ సంక్షోభం సమయంలో కూడా సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆర్థికంగా చితికిపోయిన ఎంతోమందికి చేయూతనందించే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు కరోనా వైరస్ సంక్షోభం సమయంలో చితికిపోయిన ఎంతోమంది వీధి వ్యాపారులకు చేయూతనందించే విధంగా.. జగనన్న తోడు అనే పథకాన్ని నేడు ప్రారంభించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

ఇక ఈ పథకంలో భాగంగా వీధి వ్యాపారులకు ఎలాంటి వడ్డీ లేకుండానే రుణాలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ పధకంలో అర్హులు అయినప్పటికీ పదివేల రూపాయలు పొందని వారు వెంటనే మీ పత్రాలను వార్డు సచివాలయంలో ఇచ్చి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అంటూ అధికారులు సూచించారు.

ఆ పథకం డబ్బులు రాలేదా.. ఇలా చేస్తే సరి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts