నాగార్జునపై నెటిజన్స్ ఫైర్‌.. అత‌డే కార‌ణం!

November 29, 2020 at 10:07 am

ప్ర‌స్తుతం కింగ్ నాగార్జున పై నెటిజ‌న్లు తీవ్రంగా మండిప‌డుతున్నారు. నాగార్జున్ ఏం త‌ప్పు చేశారు? ఆయ‌న‌పై ఎందుకు మండిపాటు? అన్న ప్ర‌శ్నులు మీ మ‌దిలో మొద‌ల‌య్యే ఉంటాయి. అందుకు కార‌ణం అభిజిత్ అనే చెప్పాలి. ప్ర‌స్తుతం బిగ్ బాస్ రియాలిటీ షో నాల్గువ సీజ‌న్ ప‌న్నెండో వారం పూర్తి కాబోతోంది. అయితే నిన్న శ‌నివారం కావ‌డంతో.. నాగార్జున‌ వ‌చ్చి ఇంటి స‌భ్యుల‌తో ముచ్చ‌టించారు.

అలాగే ఈ వారం హౌస్ మేట్స్ ఎవ‌రేమి త‌ప్పులు చేశారో ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలోనే అభిజిత్‌కు నాగార్జున ఫుల్ క్లాస్ పీకారు. ఇంటి స‌భ్యులంద‌రినీ ఏం తప్పులు చేశార‌ని ప్ర‌శ్నించిన నాగ్‌.. అభిజిత్ వంతు వ‌చ్చే స‌రికి బిగ్‌బాస్‌ గేట్లు తెరవండి అంటూ అంద‌రినీ షాక్‌కు గురిచేశారు. అనంత‌రం అభిజిత్‌ తప్పుల చిట్టాను నాగ్ బ‌య‌ట‌పెట్టారు.

ఈ క్ర‌మంలోనే అభి టాస్కు చేయ‌లేద‌ని నాగార్జున నిర్మొహ‌మాటంగా చెప్పేశాడు. అలాగే కొన్ని వీడియో చూపిస్తూ.. అత‌డికి క్లాస్ పీకారు. అయితే ఈ విష‌యంలోనే నాగార్జున‌ను అభిజిత్ అభిమానులు మ‌రియు ప‌లువురు నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. అంత సీరియస్ గా నాగ్ అభిజిత్ ను మందలించాల్సిన అవ‌స‌రం ఏంటని, కావాల‌నే అత‌డిని టార్గెట్ చేస్తున్నార‌ని ఫైర్ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే స్టాప్ టార్గెటింగ్ అభి అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. మొత్తానికి అభిజిత్ కార‌ణంగా నాగార్జున ట్రోలింగ్‌కు గుర‌వుతున్నారు.

నాగార్జునపై నెటిజన్స్ ఫైర్‌.. అత‌డే కార‌ణం!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts