ఆచార్య సెట్ కి వెళ్లిన సోను ఫ్యాన్స్..?

November 30, 2020 at 4:05 pm

సినిమాల్లో విలన్ పాత్రలో నటించి ఎంతో మంది ని భయ పెట్టిన సోను సూద్ ఆ తర్వాత మాత్రం నిజ జీవితంలో ఎంతో మంది ఆపద్బాంధవుడిగా మారిపోయి అసలు సిసలైన మానవత్వం ఉన్న మనిషిగా కష్టాల్లో ఉన్నవారికి ఆపద్బాంధవుడిగా ప్రత్యక్ష దైవంగా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ సంక్షోభం మొదలైన నాటి నుంచి నేటికి కూడా ఎంతో మంది విద్యార్థులకు కుటుంబాలకు నిరు పేదలకు కూడా సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నాడు సోను సూద్.

అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న సోను సూద్ ఇటీవలే హైదరాబాద్లో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక విషయం తెలుసుకున్న అభిమానులు సోనూసూద్ ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో ఆచార్య షూటింగ్ స్పాట్ కు చేరుకొని సోనుసూద్ తో మాట్లాడారు ఇక అభిమానులందరినీ ఎంతో ప్రేమగా పలకరించి మాట్లాడారు సోను సూద్.

ఆచార్య సెట్ కి వెళ్లిన సోను ఫ్యాన్స్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts