
బాలీవుడ్ నటి అంకితా లోఖండే ఎప్పుడుయాక్టివ్గా ఉంటూ తన వృత్తిగత, వ్యక్తిగత సంగతులను తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. ఇటీవలే ఆమె తాజాగా తన బాయ్ ఫ్రెండ్ విక్కి జైన్‌తో కలిసి డాన్స్ చేసిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. నేను, విక్కి కలిసి డాన్స్ చేస్తున్నాం అంటూ కాప్షన్ కూడా పెట్టారు. ఆ డాన్స్ వీడియోలో ఇద్దరూ తెల్లని దుస్తులు ధరించి నృత్యం చేస్తున్నారు. హృతిక్ రోషన్ బ్యాంగ్ బ్యాంగ్ చిత్రంలోని ఒక పాటకు ఇద్దరూ కలిసి హుషారుగా స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అయింది.
తాజాగా జరుపుకున్న దీపావళి వేడుకల పిక్స్ కూడా అంకిత సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అంకిత హిందిలో వచ్చిన పవిత్ర రిష్ట టీవీ షో ద్వారా బాగా పాపులర్ అయ్యారు. తరువాత ఏక్ థి నాయక, శక్తి అస్తిత్వా కే ఎహ్సాస్ కి వంటి పలు షోల్లో ఆమె నటించి మంచి గుర్తింపు పొందారు. కంగానా రనౌత్ లీడ్ రోల్లో నటించిన మణికర్ణిక చిత్రం ద్వారా అంకిత బాలీవుడ్ చలన చిత్ర రంగంలోకి ఆరంగేట్రం చేసారు.