
సాధారణంగా నటీనటుల లవ్ స్టోరీలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా చర్చిస్తుంటారు. ఇప్పుడు తాజాగా హీరోయిన్ అక్షర హాసన్ లవ్ స్టోరీ హల్చల్ చేస్తుంది. హీరోయిన్ అక్షరహాసన్ పై సంచలన ఆరోపణలు చేసారు నటుడు తనూజ్. అక్షర హాసన్ తాను గత నాలుగేళ్లుగా డేటింగ్లో ఉన్నామంటూ నటుడు తనూజ్ వీర్యాన్ని చెప్పారు.
అయితే 2018 ఏడాదిలో ఇరువురు ఇష్టపూర్వకంగానే బ్రేక్ అప్ చెప్పి విడిపోయారు. అయితే ఇదివరకు అక్షర హాసన్ కు సంబంధించిన ప్రైవేటు పిక్స్ రిలీజ్ అవ్వడంతో తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పాడు తనూజ్. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు హీరో తనూజ్ .బ్రేకప్ తర్వాత మేమిద్దరం స్నేహితులుగా ఉన్నామంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అక్షర హాసన్ బాయ్ ఫ్రెండ్ కూడా తనకు పరిచయమే అంటూ చెప్పాడు తనూజ్.