న‌టి ఖుష్బూ కారుకు ఘోర రోడ్డు ప్రమాదం!

November 18, 2020 at 11:02 am

సినీ న‌టి, రాజ‌కీయ నాయ‌కురాలు ఖుష్బూ ప్ర‌యాణిస్తున్న కారుకు ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. తమిళనాడులోని మెల్మార్‌వత్తూర్ దగ్గర ఖుష్బూ ప్రయాణిస్తున్న కారును ఓ ట్యాంకర్ ఢీకొంది. అయితే అదృష్టవశాస్తు ఈ ప్ర‌మాదంలో ఖుష్బూకు ఎటువంటి గాయాలు తగలలేదు. దీంతో ఖుష్బూ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఖుష్బూ ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలియ‌జేశారు. అయితే ప్రమాదం జరిగింది కదా అని ఆగిపోకుండా.. తన కడలూరు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లు ఆమె తెలిపారు. అక్కడ ఆమె వెల్యాత్రాయ్‌లో పాల్గోనున్నట్లు చెప్పారు.

మ‌రోవైపు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఎదిగిన ఖుష్బూ ఇటీవ‌ల‌.. బీజేపీలో చేరిన విష‌యం తెలిసిందే. ఆరేళ్ల పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన ఖుష్బూ పార్టీ నాయకత్వంపై పలు ఆరోపణలు చేస్తూ రాజీనామా చేశారు.

న‌టి ఖుష్బూ కారుకు ఘోర రోడ్డు ప్రమాదం!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts