గుడ్ న్యూస్ : 19 రూపాయలకే లిమిటెడ్ కాల్స్…!

November 21, 2020 at 5:47 pm

టెలికాం రంగంలో తమ స్థానం నిలబెట్టుకునేందుకు అనేక కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్‌లను తీసుకొస్తునారు. చాలా మంది మొబైల్ రీచార్జ్ చేసుకునేటప్పుడు తక్కువ ప్లాన్స్ కోసం వెతుకుతుంటారు. అతి తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలు ఇచ్చే ప్లాన్‌ను ఎంచుకుంటారు. ప్రస్తుతం ఉన్న పోటీ కారణంగా చాలా సంస్థలు అతి తక్కువ ప్లాన్‌లను తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం ఎయిర్‌టెల్ కూడా తమ కస్టమర్లకు మరింత లాభం చేకూరేలా చౌకయిన రూ.19 ప్లాన్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది.

కస్టమర్స్ కి ఈ ప్లాన్లో కాలింగ్‌తో పాటు డేటా కూడా లభిస్తోంది. ట్రూలీ అన్‌లిమిటెడ్ ప్లాన్ కింద ఈ 19 రూపాయల ప్లాన్‌ను తీసుకొచ్చింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్‌తో కస్టమర్ రీచార్జి చేసుకుంటే అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. ఉచిత కాలింగ్‌తో పాటు దీనిలో డేటా కూడా లభిస్తుంది. కానీ 200 ఎంబీ డేటా మాత్రమే కస్టమర్ల కి భిస్తుంది. ఉచిత ఎస్‌ఎంఎస్‌లు ఈ ప్లాన్లో వర్తించవు. కానీ దీనిలో మరో చిక్కుంది. అదేమిటంటే ఈ ప్లాన్ కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుంది. అంటే దీని వ్యాలిడిటీ రెండు రోజులు వరకే. అంటే ఎయిర్‌టెల్ అందించే రూ.19 ప్లాన్‌తో రీచార్జి చేసుకుంటే కస్టమర్ కి రెండు రోజుల ఉచిత కాలింగ్‌తో పాటు 200ఎంబీ డేటా పొందవచ్చు అన్నమాట.

గుడ్ న్యూస్ : 19 రూపాయలకే లిమిటెడ్ కాల్స్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts