మోనాల్‌తో డేటింగ్‌కి వెళ్లిన అఖిల్.. ఏడ్చేసిన అభిజిత్‌!

November 26, 2020 at 8:59 am

ప‌న్నెండో వారానికి చేరుకున్న బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో చివ‌రి ద‌శ‌కు చేరువ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఉన్న ఇంటి స‌భ్యులంద‌రూ టైటిల్ కోసం పోటా పోటీ ప‌డుతున్నారు. ఇక నిన్న‌టి ఎపిసోడ్ విష‌యానికి వ‌స్తే.. బిగ్‌బాస్‌ లగ్జరీ టాస్క్‌లో భాగంగా అభిజిత్, అఖిల్‌లు కలిసి మోనాల్‌ని చాలా ఏడిపించారు. కాబట్టి మీ ఇద్దరిలో ఒకరు మోనాల్ డేట్‌కి తీసుకుని వెళ్లాల‌ని బిగ్ బాస్ ఆదేశించాడు.

అయితే దీనిపై అభిజిత్‌ అసహనం వ్యక్తం చేశారు. నాకు అసలు ఈ టాస్క్ వద్దు.. ఈ టాస్క్‌కి నేను ఒప్పుకుంటే నేను ఆమెను ఏడిపించానని ఒప్పుకున్నట్టు. అసలు మోనాల్ టాపిక్ నా దగ్గర ఉండకూడదు అనుకుంటున్నా.. మళ్లీ డేట్ ఏంటి? నేను డేట్‌కు పోను అంటూ ఏడ్చేశాడు. ఇక అభిజిత్ నిరాకరించిన కారణంగా అఖిల్ టాస్క్ కంప్లీట్ చేయాలని చెప్పారు.

అఖిల్‌తో డేట్‌ అనగానే.. చిరునవ్వులు చిందిస్తూ, మోనాల్‌ అందంగా ముస్తాబు అయ్యింది. ఇద్దరు కలిసి గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు. ఈ క్ర‌మంలోనే మోనాల్‌తో అఖిల్ కాసేపు పులిహోర క‌లిపాడు. ఆ తరువాత నందికొండ వాగుల్లోనా సాంగ్‌ రావడంతో ఇంటి సభ్యులంతా స్టెప్పులు వేస్తూ కనిపించారు.

మోనాల్‌తో డేటింగ్‌కి వెళ్లిన అఖిల్.. ఏడ్చేసిన అభిజిత్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts