ప్రియుడి బంగ్లాలో అలియా !!

November 29, 2020 at 6:38 pm

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అందాల భామ అలియాభ‌ట్ త‌న ప్రియుడు ర‌ణ్‌బీర్ క‌పూర్‌కు మ‌రింత దగ్గరవబోతుంది.అంటే అలియా త‌న‌ బాయ్ ఫ్రెండ్ నివ‌సిస్తున్న అపార్ట్‌మెంట్‌లోనే ఓ ఫ్లాట్‌ ఖరీదు చేసింది. ముంబైలోని పాలి హిల్‌లో 2460 విశాలవంతమయిన ఫ్లాట్ త‌న సొంతం చేసుకున్నార‌ని మీడియా వర్గాల టాక్. స‌ద‌రు అపార్ట్‌మెంట్‌లో నటుడు ర‌ణ్‌బీర్‌ది ఏడో అంత‌స్థు కాగ, అలియా ఐదో అంత‌స్థు లో కొన్నారంట. ఈ ఇంటికి గ‌త‌ నెల‌లోనే పూజ కార్యక్రమాలు కూడా జరిపారు. ఈ కార్య‌క్ర‌మానికి అలియా ఫామిలీతో పాటు ర‌ణ్‌బీర్ ఫ్యామిలీ కూడా అటెండ్ అయ్యారు.

అలియా తన కొత్తింటి కోసం ఏకంగా రూ. 32 కోట్లు పెట్టి కొనుగోలు చేసారని స‌మాచారం. ఈ ఇంటిని అందంగా తీర్చిదిద్దే బాధ్య‌త‌ను గౌరీఖాన్‌కు అప్ప‌గించారు అలియా. ప్రస్తుతం ఈ ల‌వ్‌బ‌ర్డ్స్ క‌లిసి న‌టించిన బ్ర‌హ్మాస్త్ర చిత్రం రిలీజ్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.

ప్రియుడి బంగ్లాలో అలియా !!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts