విద్యార్థి నాయకుడిగా బన్నీ..!?

November 29, 2020 at 6:20 pm

తాజాగా దర్శకుడు కొర‌టాల శివ , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం అందరికి తెలిసిందే. తొలిసారిగా వ‌స్తున్న వీళిద్దరి కాంబినేషన్ పై అందరిలో ఉత్కంఠ నెల‌కొంది. ప్ర‌స్తుత్ం హీరో బ‌న్నీ పుష్ప చిత్రంతో, చిరంజీవి ఆచార్య షూటింగ్ తో దర్శకుడు కొర‌టాల శివ బిజీగా ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్త‌వ‌గానే బ‌న్నీ, కొర‌టాల మూవీ సెట్స్‌పైకి వెళ్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌రమయిన విషయాలు ఫిలింన‌గర్ లో హల్చల్ చేస్తున్నాయి. పొలిటికల్ నేప‌థ్యంలో సాగేలా ఈ సినిమా ఉండబోతున్నట్లు లేటెస్ట్ టాక్‌. అంతేకాకుండా సినిమా సెకండాఫ్ లో స్టైలిష్అ హీరో అల్లు అర్జున్ విద్యార్థి నాయ‌కుడిగా క‌నిపించ‌బోతున్నట్లు వినికిడి.

గీతాఆర్ట్స్ 2 , కొర‌టాల స్నేహితుడు మిక్కిలినేని సుధాక‌ర్ యువ సుధా ఆర్ట్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హై బ‌డ్జెట్ ఎంట‌ర్ టైన‌ర్ గా వ‌స్తున్న ఈ సినిమా గురించి మ‌రిన్ని విష‌యాలు తెలియాలంటే కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.

విద్యార్థి నాయకుడిగా బన్నీ..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts