
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా మరో రేర్ రికార్డ్‌ను క్రియేట్ చేశారు. అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన `అల వైకుంఠపురములో` చిత్రం ఎంత మంచి విజయాన్ని అందుకుంతో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. టబు, జయరాం, మురళీ శర్మ, సుషాంత్, నివేథ పెతురాజ్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు.
ఇక ఈ సినిమా హిట్ అవ్వడానికి.. మ్యూజిక్ కూడా ఓ కారణం. ముఖ్యంగా ఈ చిత్రంలో `బుట్ట బొమ్మ` సాంగ్ రికార్డు స్థాయి వ్యూస్ తో సెన్సేషన్ సృష్టించింది. అయితే తాజాగా ఈ చిత్రంలో `రాములో రాముల` సాంగ్ మరో రేర్ ఫీట్ ను అందుకుని.. బన్నీ ఖాతాలో ఓ కొత్త రికార్డు పడేలా చేసింది.
తాజాగా ఈ పాట రెండు వెర్షన్లు అంటే లిరికల్ అండ్ ఫుల్ వీడియో సాంగ్ కలుపుకుని ఏకంగా 250 మిలియన్ వ్యూస్ దాటేసి.. మన దక్షిణాదిలోనే మొట్ట మొదటి సాంగ్‌గా రికార్డు సృష్టించింది. దీంతో బన్నీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, కెరీర్ మొదలైన ఇన్నేళ్ళ తర్వాత తొలిసారి బన్నీ ఈ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకున్నాడు.