
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది.
లాక్డౌన్ తర్వాత ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. త్వరలోనే అల్లు అర్జుణ్ పుష్ప షూటింగ్లో భాగంగా వారణాసి వెళ్లనున్నాడట. డిసెంబర్ 18 నుండి మొదలయ్యే కొత్త షెడ్యూల్ లో సాంగ్ ను షూట్ చేయనున్నారట. అయితే ఈ సాంగ్ మొత్తం వారణాసిలో చేయాలని సుక్కూ ప్లాన్ చేస్తున్నారట.
ఈ క్రమంలోనే బన్నీతో సహా పుష్ప టీమ్ మొత్తం వారణాసి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో త్వరలోనే తెలియనుంది. కాగా, ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.