అమరావతి ఇష్యూ.. రఘురామ కీలక వ్యాఖ్యలు..?

November 2, 2020 at 3:23 pm

ప్రతిరోజు రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా ఏదో ఒక అంశాన్ని తెరమీదికి తెచ్చి జగన్మోహన్ రెడ్డి సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఓ వైపు జగన్ సర్కార్ ను పొగుడుతూన్నట్లుగా మాట్లాడుతూనే మరోవైపు అనాల్సిన మాటలు అన్ని అనేస్తున్నారు రఘురామకృష్ణంరాజు. అమరావతి విషయంలో ఎప్పటికప్పుడు జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోసారి అమరావతి అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చిన రఘురామకృష్ణంరాజు… అమరావతిలో మహిళలపై దాడులు జరగడం దారుణం అంటూ వ్యాఖ్యానించారు.

రాజధాని విశాఖ కు మారిస్తే భూముల ధరలు పెరుగుతాయి అన్న ఆలోచనతోనే.. పార్టీ నేతలందరూ రాజధాని మార్పు నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు అంటూ ఆరోపించారు రఘురామకృష్ణంరాజు. ఇక విశాఖ రాజధాని అనగానే ఆనందపడిన ప్రజలు… అక్రమాలు పెరిగిపోవడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు అంటూ విమర్శించారు.

అమరావతి ఇష్యూ.. రఘురామ కీలక వ్యాఖ్యలు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts