అమిత్ షా పై ల ప్లకార్డు విసిరిన నిరసనకారులు..?

November 21, 2020 at 5:34 pm

కొన్నిసార్లు రాజకీయ నాయకులు వివిధ ప్రాంతాలకు పర్యటనకు వెళ్లిన సమయంలో పలు రకాల చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి అనే విషయం తెలిసిందే. రాజకీయ నాయకులకు ఆయా ప్రాంతాలలో మద్దతు దారులు ఉన్నట్లుగానే… ఆయా నాయకులకు వ్యతిరేకులు కూడా ఉంటారు. ఇక ఇటీవలే హోం శాఖ మంత్రి అమిత్ షా చెన్నై పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పర్యటనలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో అమిత్ షా భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.

అమిత్ షా చెన్నై పర్యటనలో భాగంగా ఎంతో మంది నిరసనకారులు గో బ్యాక్ అంటూ ప్లకార్డులు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి ఏకంగా అమిత్ షా వైపు ప్లకార్డును విసరడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమిత్ షా నుంచి 50 మీటర్ల దూరంలో పడింది ప్లకార్డు. ఇక వెంటనే స్పందించిన పోలీసు అధికారులు సదరు నిరసనకారులను అరెస్టు చేశారు. అనంతరం అమిత్ షా పర్యటన సజావుగా సాగింది.

అమిత్ షా పై ల ప్లకార్డు విసిరిన నిరసనకారులు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts