కోట్లు ఇచ్చినా ఆ ప‌ని చేయ‌నంటున్న యాంకర్ విష్ణు ప్రియ!

November 27, 2020 at 9:54 am

యాంకర్ విష్ణు ప్రియ.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ.. ప్ర‌స్తుతం బుల్లితెరపై స్టార్ యాంక‌ర్‌గా స‌త్తా చాటుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో కూడా విష్ణు య‌మా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటోల‌ను షేర్ చేస్తూ.. కుర్ర‌కారు గుండెల్లో కాక రేపుతోంది.

ఇదిలా ఉంటే.. బుల్లితెర పాపుల‌ర్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ‌ సీజ‌న్‌లో విష్ణు పాల్గొంటుంద‌ని తెగ ప్ర‌చారం జ‌రిగింది. కానీ, అవి పుకార్లే అని తేలిపోయాయి. అయితే తాజాగా విష్ణు ప్రియ ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యంపై మ‌రియు బిగ్ బాస్ షోపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. విష్ణు మాట్లాడుతూ.. `నాకు బిగ్ బాస్ అంటే ఇష్టం ఉండదు. అలాంటి షోకి డబ్బులు ఇస్తున్నారంటే ఎందుకు పోతా.. లక్షలు కాదు.. ఎన్నికోట్లు ఇచ్చినా నేను బిగ్ బాస్ షోకి కంటెస్టెంట్‌గా వెళ్లను.` అంటూ విష్ణు తెలిపింది.

అలాగే తాను బిగ్ బాస్ లాంటి షోల‌ను అస్స‌లు ఎంకరేజ్ చేయన‌ని.. ఆ షోలో కొట్టుకోవడాలు.. ఎలిమినేషన్‌లు.. నాకు ఇష్టం ఉండద‌ని విష్ణు ప్రియ తెలిపిందే. ఇక‌ నా ఉద్దేశం ప్రకారం లైఫ్‌లో ఏ ఒక్కరినీ ఎలిమినేట్ చేయకూడదు. వీలైతే ప్రేమించాల‌ని చెప్పిన విష్ణు.. కేవలం డబ్బు కోసం అలాంటి షోల‌లో పార్టిసిపేట్ చేయ‌న‌ని తెలిపింది.

కోట్లు ఇచ్చినా ఆ ప‌ని చేయ‌నంటున్న యాంకర్ విష్ణు ప్రియ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts