మలయాళంలో కురుడన్‌ ట్యూన్‌..!!

November 29, 2020 at 7:01 pm

బాలీవుడ్ లో ఆయుష్మాన్‌ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్యమయిన పాత్రల్లో శ్రీరామ్‌ రాఘవన్‌ తెరకెక్కించిన థ్రిల్లర్‌ సినిమా అంధా ధున్‌. హిందీలో పెద్ద విజయం సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో రీమేక్‌ అవుతున్న సంగతి అందరికి తెలిసిందే. తెలుగులో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో హీరో నితిన్ తో ఈ మూవీ రీమేక్‌ అవుతోంది. తమిళ రీమేక్‌లోహీరో ప్రశాంత్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మలయాళంలో కూడా రీమేక్‌ కాబోతోందని తెలిసింది.

ఈ మలయాళ రీమేక్‌లో ఆయుష్మాన్‌ రోల్ ను పృథ్వీరాజ్‌ చేయనున్నారు. ఈ సినిమాలో హీరో అంధుడిగా నటించారు. అంధుడు అంటే మలయాళంలో కురుడన్ అంటారు. అంధా ధున్‌ అంటే మలయాళంలో కురుడన్‌ ట్యూన్ అని‌. అలాగే హిందీలో టబు చేసిన పాత్రలో మమతా మోహన్‌దాస్‌ కనిపించబోతున్నట్లు సమాచారం.

మలయాళంలో కురుడన్‌ ట్యూన్‌..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts