టాలీవుడ్ లోకి మరో కొత్త హీరోయిన్..!

November 26, 2020 at 6:47 pm

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ఎంతోమంది హీరోయిన్లు వస్తూ ఉంటారు. తమ నటనతో, అభినయంతో అభిమానులను ఆకర్షించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు హీరోయిన్లు. కొంతమంది హీరోయిన్లు అదృష్టం కలిసి వచ్చి అభిమానులను అక్కటుకుని విజయాన్ని తన అకౌంట్లో వేసుకుని స్టార్ హీరోయిన్ రేంజికి ఎదుగుతారు. కొంతమంది మాత్రం ఎన్ని సినిమాలు చేశామని కాకా, ఎలాంటి రోల్ చేసారో చూసుకుంటారు. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. తాజాగా ఇప్పుడు మరో కొత్త హీరోయిన్ టాలీవుడ్ కి పరిచయం అవ్వబోతున్నారు తెలుస్తుంది.

మలయాళంలో మంచి హిట్ సాధించి ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించిన కప్పేల అనే చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హీరో నవీన్ చంద్ర, విశ్వక్ సేన్ లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంతో అనికా సురేంద్ర టాలీవుడ్ పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయం అవ్వబోతుంది. అనికా సురేంద్ర తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా నటించిన పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులని మెప్పించింది.

టాలీవుడ్ లోకి మరో కొత్త హీరోయిన్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts