జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం.. దీపావళి సంబరాలు రెండు గంట‌లే!

November 11, 2020 at 8:25 am

పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఎంతో ఇష్టంగా, ఆనందంగా జ‌రుపుకునే పండ‌గ దీపావ‌ళి. దీపావళి పండుగ కేవలం హిందువులే కాకుండా అన్ని మాతల వారు అత్యంత వేడుకగా జరుపుకుంటారు. ఇక దీపావ‌ళి అంటే అంద‌రికీ ముందు గుర్తుకు వ‌చ్చేది టపాసులే. అయితే ఈ ఏడాది మాయ‌దారి క‌రోనా వైర‌స్ కార‌ణంగా పలు రాష్ట్రాలు బాణాసంచ పేలుళ్లపై నిషేధం విధిస్తున్న విషయం తెలిసిందే.

ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, కర్నాటక వంటి రాష్ట్రాలు ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు కూడా జారి చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి త‌రుణంలో జ‌గ‌న్‌ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కేవలం రెండు గంటల పాటు మాత్రమే అంటే.. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసుల కాల్చుకోవాలని సూచించింది. మ‌రోవైపు అమ్మకాలపై కూడా కొన్ని నిషేధ ఆజ్ఞలు జారీ చేసింది.

కేవలం కాలుష్యరహిత టపాసులు మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశించింది. ప్రతి షాపుకి మధ్య 10 అడుగుల దూరం ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. షాపుల వద్ద కొనుగోలు దారుల మధ్య ఖచ్చితంగా 6 అడుగులు దూరం పాటించాలని సూచించింది. ఇక‌ దీపావళి సామగ్రి అమ్మే షాపుల వద్ద శానిటైజర్లు పెట్ట‌వ‌ద్ద‌ని తెలిపింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం.. ఏపీ స‌ర్కార్ ఈ నిర్ణ‌యాలు తీసుకుంది.

జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం.. దీపావళి సంబరాలు రెండు గంట‌లే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts