
తమిళనాడులో తీరం దాటిన నివర్ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై భారీగా పడిన సంగతి తెలిసిందే. తుఫాన్ ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వర్షాల కారణంగా పంట నష్టంతో పాటు ఎందరో నివాసాన్ని కూడా కోల్పోయారు. అయితే తాజాగా నివర్ తుఫాన్ బాధితులకు గుడ్ న్యూస్ తెలిపింది.
ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాల కారణంగా పలు జిల్లల్లో దాదాపు పది వేల మందికి పైగా సహాయక శిబిరాలకు తరలించారు. అయితే శిబిరాల్లో తలదాచుకుంటున్న వాళ్లందరికీ చిన్నా, పెద్దా అనే బేధం లేకుండా రూ. 500 చొప్పున సాయం అందజేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
అలాగే డిసెంబర్ 15 కల్లా పంటనష్టం అంచనాల రూపకల్పన, డిసెంబర్ 30 కల్లా పరిహారం చెల్లించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కేబినెట్ భేటీ తర్వాత మంత్రి కురసాల కన్నబాబు మీడియాకు తెలియజేశారు.