ఏపీ తెలంగాణలో త్రిబుల్ ఐటీ పరీక్ష వాయిదా..?

November 27, 2020 at 4:58 pm

ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూ నే ఉన్నాయి అనే విషయం తెలిసిందే. సరిగ్గా పరీక్షలు జరిగే సమయానికి గతంలో కరోనా వైరస్ వెలుగులోకి రావడంతో లాక్ డౌన్ అమలులోకి వచ్చి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికికూడా ఈ ఇబ్బందులు పూర్తిస్థాయిలో తొలగి పోవడం లేదు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మరో సారి విద్యార్థులకు తీవ్ర నిరాశే ఎదురయింది.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో రేపు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అటు విద్యార్థులు కూడా ఈ పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యారు. కానీ ఇంతలో విద్యార్థులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రస్తుతం నివర్ తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో త్రిబుల్ ఐటీ ఎంట్రెన్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఇటీవలే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి . డిసెంబర్ 5వ తేదీన ఈ పరీక్ష జరగనుంది. కాగా ఉదయం 11 గంటల నుంచి ఈ పరీక్ష ప్రారంభం కానుంది. అయితే విద్యార్థులు రెండు గంటల ముందే పరీక్ష కేంద్రాలకు హాజరుకావాల్సి ఉంటుంది..

ఏపీ తెలంగాణలో త్రిబుల్ ఐటీ పరీక్ష వాయిదా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts