అప్పుడు చెప్పాను.. ఇప్పుడు చెబుతున్న.. నేను సిద్ధం : రోహిత్ శర్మ

November 22, 2020 at 3:14 pm

గత కొంత కాలం నుంచి రోహిత్ శర్మ కు సంబంధించి ఆసక్తికర చర్చ కొనసాగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ ని సెలెక్ట్ చేయకుండా ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ ప్రకటించిన నాటి మొదలైన చర్చ ప్రస్తుతం ఇప్పటికికూడా ఆగడం లేదు అయితే. ఎట్టకేలకు బిసిసిఐ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనకు సెలెక్ట్ చేసినప్పటికీ… ఇక రోహిత్ శర్మ జట్టులో ఏ స్థానంలో ఆడబోతున్నాడు అనేదానిపై సరికొత్త చర్చ మొదలయింది.

కాగా ఈ విషయంపై స్పందించిన రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను జట్టులో ఏ స్థానంలో బ్యాటింగ్కు దిగడానికైనా సిద్ధంగా ఉన్నాను అన్న విషయాన్ని గతంలో కూడా అందరికీ చెప్పానని ప్రస్తుతం ఇదే విషయాన్ని చెబుతాను అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. జట్టు యాజమాన్యం తనను ఏ స్థానంలో దించిన ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని…. అయితే తనను ఓపెనర్లుగా బరిలోకి దింపుతారా లేదా అన్న దానిపై మాత్రం తనకు కూడా క్లారిటీ లేదు అంటూ చెప్పుకొచ్చాడు.

అప్పుడు చెప్పాను.. ఇప్పుడు చెబుతున్న.. నేను సిద్ధం : రోహిత్ శర్మ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts